ఎల్ నినో
సముద్రం రగిలితే
నేల కన్నీరు పెడుతుంది!
సముద్రం వేడెక్కితే
పవనాల నడక మారుతుంది
మేఘాల దారి మళ్లితే
రైతు ఆశలపై కరువు నీడ పడుతుంది!
పసిఫిక్ జలాల గర్భంలో
ఉష్ణోగ్రతల అసాధారణ పెరుగుదల
వాణిజ్య పవనాల బలహీనత
వెరసి వాతావరణంలో
సృష్టించే కల్లోలమే ఎల్ నినో!
సాధారణంగా రెండు నుంచి
ఏడేండ్ల వ్యవధిలో
అప్పుడప్పుడు ఆవిర్భవిస్తూ
వాతావరణ గమనంలో మార్పులు తెచ్చే
సహజ పరిణామమే ఎల్ నినో!
దాని ప్రభావం తాకితే
రుతుపవనాలపై అనిశ్చితి
చెరువుల గుండెల్లో నెర్రెలు
పంట పొలాల్లో నిశ్శబ్దం
రైతు కళ్లలో దిగులు!
బావులు అడుగంటుతాయి
పచ్చదనం పలుచబడుతుంది
పశువులకు మేత కరువవుతుంది
తాగునీటి కోసం
గ్రామాల గొంతులు ఎండిపోతాయి!
అయితే ఎల్ నినో అంటే
కరువు తప్పనిసరి కాదు
ప్రాంతాన్ని బట్టి..పరిస్థితులను బట్టి
వర్షాల తీరు మారవచ్చు!
సముద్రపు సెగను ఆపలేకపోవచ్చు
కానీ నేల దాహాన్ని తగ్గించవచ్చు!
ప్రకృతి పరిణామాన్ని మార్చలేకపోవచ్చు
ముందస్తు జాగ్రత్తతో
నష్టాన్ని నివారించవచ్చు!
వానచుక్కను ఒడిసిపట్టి
జలవనరులను సంరక్షించి
రైతుకు భరోసా ఇచ్చినప్పుడే
ఎల్ నినో సవాల్‌ను
మన విజ్ఞానం ఎదుర్కోగలదు!
-డా. పగిడిపల్లి సురేందరు. 8074846063
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

