హృద్యమైన ప్రయాణమే ఇతివృత్తంగా
సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ కలిసి ఓ ఆసక్తికరమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి. ‘మోటార్‌సైకిల్ డైరీస్' పేరుతో రానున్న ఈ చిత్రాన్ని కన్నడ అగ్ర నటుడు రిషబ్ శెట్టి సమర్పిస్తున్నారు. శివ చిరంతన ఆ చిత్రానికి దర్శకుడు.
సితార ఎంటర్టైన్మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ కలిసి ఓ ఆసక్తికరమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ పేరుతో రానున్న ఈ చిత్రాన్ని కన్నడ అగ్ర నటుడు రిషబ్ శెట్టి సమర్పిస్తున్నారు. శివ చిరంతన ఆ చిత్రానికి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్‌శెట్టి నిర్మాతలు. ఆదివారం ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు.
ప్రతి మైలురాయి ఓ జ్ఞాపకంలా, ప్రతి మలుపు ఓ కథలా సాగే అందమైన ప్రయాణమే ఈ సినిమా అని, గమ్యస్థానాలకంటే ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, మరిచిపోలేని సంఘటనలకే ప్రాధాన్యతనిస్తూ ఓ హృద్యమైన ట్రావెల్ ఫిల్మ్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: భువన్‌రెడ్డి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, ఎడిటర్: నవీన్ నూలి, కళ: ధరణి గంగపుత్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

