కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు ఎండుతున్న వరి పొలాలు
వేసవి రావడం రావడంతోనే ఎండలు దంచి కొడుతుండగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్లందక నెర్రె లు బారుతున్నాయి. బీఆర్ఎస్ హ యాంలో 24 గంటల కరెంటు ఉన్నా ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాల లేదని, ప్రస్తుతం 24 గంటల కరెంట్ లేకపోయినా రోజుకోచోట ట్రాన్స్ఫార్మర్ కాలి పొలాలు ఎండుతుండటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
- విలవిలలాడుతున్న అన్నదాతలు
పాలకుర్తి, మార్చి 7: వేసవి రావడం రావడంతోనే ఎండలు దంచి కొడుతుండగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్లందక నెర్రె లు బారుతున్నాయి. బీఆర్ఎస్ హ యాంలో 24 గంటల కరెంటు ఉన్నా ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాల లేదని, ప్రస్తుతం 24 గంటల కరెంట్ లేకపోయినా రోజుకోచోట ట్రాన్స్ఫార్మర్ కాలి పొలాలు ఎండుతుండటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో లోవోల్టేజీ సమస్యతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో వరి పొలాలు నీళ్లందక ఎండిపోయి నెర్రెలు బారుతున్నాయి. పాలకుర్తి మండలంలోని దర్దేపల్లిలో గత శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, వారం రోజులైనా విద్యుత్తు అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని దాని పరిధిలోని రైతులు జలగం అంజయ్య, కర్నె రవి, నిమ్మల యాక య్య, ముస్కు నాగయ్య, ఓరుగంటి పుల్ల య్య, మేడికోదండ రామయ్య, కూస మ హేందర్తోపాటు పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించినా లాభంలేదని అన్నారు. సగం మో టర్లు నడవక మళ్లీ ట్రాన్స్ఫార్మర్ను ఇప్పి సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు తెలిపారు. సిబ్బం ది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఎండుతున్న పంటలను చూస్తే కన్నీళ్లు కారుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి నాణ్యమైన కరెంటు అందించాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

