బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పునరుద్ధరించాలి
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వ పూర్వసలహాదారుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రమణాచారి విజ్ఞప్తిచేశారు.
- తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారుడు కేవీ రమణాచారి
తెలుగు యూనివర్సిటీ, మార్చి 7: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వ పూర్వసలహాదారుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రమణాచారి విజ్ఞప్తిచేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి మాజీ సీఎం కేసీఆర్ పాటుపడగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమం పూర్తిగా అటకెక్కిందని పేర్కొన్నారు. రెడ్‌హిల్స్‌లో తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. గతంలో బ్రాహ్మణుల బాధలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తనను అధ్యక్షుడిగా నియమించి, ప్రభుత్వానికి ఆర్థిక భారమైనా సాహసోపేతమైన నిర్ణయంతో బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఉన్నదనే విషయం మరిచిపోవడం బాధాకరమని తెలిపారు. ఈ పథకం గురించి సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పథకంపై ఇంకా ఎంతకాలం ఈ నిర్వీర్యత అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించి ఉగాది సందర్భంగానైనా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యకలాపాలను కొనసాగించాలని రమణాచారి ప్రభుత్వానికి విన్నవించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

