Akhil | అఖిల్ నెక్ట్స్ మూవీపై వస్తున్న వార్తలకు చెక్.. క్లారిటీ ఇచ్చిన టీమ్.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
Akhil | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు తన కెరీర్లో కీలక విజయాన్ని అందుకున్నారు. ఇటీవల వచ్చిన గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా ‘లెనిన్’ తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన కెరీర్లో వచ్చిన సినిమాల్లో ఇదే తొలి భారీ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Akhil | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు తన కెరీర్లో కీలక విజయాన్ని అందుకున్నారు. ఇటీవల వచ్చిన గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా ‘లెనిన్’ తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన కెరీర్లో వచ్చిన సినిమాల్లో ఇదే తొలి భారీ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. చాలా కాలంగా అఖిల్‌కు సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ‘లెనిన్’ విజయం భారీ రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో అఖిల్ తదుపరి ప్రాజెక్ట్‌పై సహజంగానే ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖిల్ నెక్ట్స్ మూవీకి సంబంధించి పలు రకాల వార్తలు, రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
అఖిల్ తదుపరి సినిమాకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఫైనల్ అయ్యాయని, పలువురు దర్శకులతో ఆయన చర్చలు జరుపుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అఖిల్ టీమ్ స్పష్టం చేసింది. ఈ మేరకు అఖిల్ అక్కినేని టీమ్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అఖిల్ తన తదుపరి సినిమాను ఇంకా ఏదీ సైన్ చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఎలాంటి వార్తలను నమ్మవద్దని, వాటిని మరింతగా ప్రచారం చేయవద్దని అభిమానులు, మీడియాను కోరింది. అఖిల్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన టీమ్ తెలిపింది. దీంతో ప్రస్తుతం అఖిల్ నెక్ట్స్ మూవీపై వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమైంది.
‘లెనిన్’ వంటి భారీ విజయం తర్వాత అఖిల్ తన తదుపరి సినిమాను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా తన కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన ‘లెనిన్’ తర్వాత వచ్చే సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖిల్ కెరీర్లో ఇప్పటివరకు పలు విభిన్నమైన కథలను ప్రయత్నించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో భారీ కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ విజయం ఆయనకు ఎంతో కీలకంగా మారింది. గ్రామీణ నేపథ్యం, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా విజయంతో అఖిల్ మార్కెట్‌పై కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ జోష్‌లోనే ఆయన తదుపరి సినిమాపై అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఇంకా ఫైనల్ చేయలేదు. దర్శకుడు, కథ, నిర్మాణ సంస్థ తదితర వివరాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే అఖిల్ తదుపరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని టీమ్ స్పష్టం చేయడంతో.. అభిమానుల చూపులన్నీ ఆ అనౌన్స్మెంట్పైనే ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

