భువనేశ్వర్: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆటో ఆగి ఉన్నది. వెనుక నుంచి వచ్చిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య ఉన్న ఆ ఆటో నుజ్జు అయ్యింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bus Rammming Auto ) ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక బస్సు, దాని వెనుక ఆటో ఆగి ఉన్నాయి.
కాగా, ఆ సిగ్నల్ వద్దకు మరో బస్సు చేరుకున్నది. ఆటో వెనుక ఆగేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే ఉన్నట్టుండి ఆ బస్సు ముందున్న ఆటోపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు బస్సుల మధ్య ఉన్న ఆటో నుజ్జునుజ్జు అయ్యింది.
మరోవైపు ఈ ప్రమాదం చూసి అక్కడుకున్న వ్యక్తులు షాక్ అయ్యారు. ముందున్న బస్సు కదలడంతో చిక్కుకున్న ఆటో కదిలింది. దీంతో ఆ బస్సు డ్రైవర్ను స్థానికులు అలెర్ట్ చేయడంతో అది ఆగింది.
అయితే ఆ ఆటోలోని ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆటో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న ఒక మహిళ ఈ ప్రమాదంలో మరణించారు. ఢీకొట్టిన బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
📍 Bhubaneswar, Odisha:
Ama Bus rear-ended an auto, crushing it between a bus and a school vehicle. Auto driver and a woman passenger lost their lives on the spot.
Locals allege reckless driving; bus crew reportedly fled after the crash. pic.twitter.com/ttMGKV793R— Deadly Kalesh (@Deadlykalesh) January 7, 2026
Also Read:
Bengaluru Engineer Dies | 16వ అంతస్తు నుంచి కిందపడి.. ఇంజినీర్ మృతి
boy dies of watching reels | ఫోన్లో రీల్స్ చూస్తూ.. గుండెపోటుతో బాలుడు మృతి