‘మీరు బీఆర్ఎస్ వాళ్లారా’ అంటూ సీఐ కొట్టారు
‘మీరు బీఆర్ఎస్ వాళ్లారా..’ అంటూ దుర్భాషలాడుతూ టేకులపల్లి సీఐ తమను కొట్టారని భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం తొమ్మిదోమైల్ తండావాసులు ఆరోపించారు.
- హోలీ ఆడుకుంటున్నామని చెప్పినా వినకుండా దుర్భాషలాడారు
- అకారణంగా కొట్టి కేసు పెట్టారు
- టేకులపల్లి మండలం తొమ్మిదో మైల్తండాలోవాసుల ఆరోపణ
టేకులపల్లి, మార్చి 4: ‘మీరు బీఆర్ఎస్ వాళ్లారా..’ అంటూ దుర్భాషలాడుతూ టేకులపల్లి సీఐ తమను కొట్టారని భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం తొమ్మిదోమైల్ తండావాసులు ఆరోపించారు. తాము హోలీ ఆడుకుంటున్నామని చెప్పినా సీఐగా యాలయ్యేలా కొట్టారని పేర్కొన్నారు. తండావాసులు బుధవారం మీడియాతో మాట్లాడారు. గ్రామస్తులు, యువకులు కలిసి మంగళవారం రాత్రి హోలీ ఆడుకుంటున్న సమయంలో సీఐ బత్తుల సత్యనారాయణ వాహనంలో గ్రామానికి వచ్చారు. వచ్చీరాగానే.. హోలీ ఆడుకుంటున్న గ్రామస్తులను దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా కొట్టారు. ‘అకారణంగా మమ్మల్నెందుకు కొడుతున్నారు సార్..’ అంటూ ప్రశ్నించిన యువకులపై ‘మీరు బీఆర్ఎస్ వాళ్లారా..’ అంటూ కొట్టడంతో వాతలు ప డ్డాయి. ‘గ్రామంలో ఎవరో ఘర్షణ పడితే మమ్మల్నెందుకు కొడుతున్నారు సార్’ అన్నా వినలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఉదయం యువకులతో వస్తే సీఐ గానీ, ఎస్సై గానీ స్టేషన్లో లేరని పేర్కొన్నారు. అకారణంగా కొట్టడమే గాక కేసు లు పెట్టి, స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

