బర్మింగ్‌హామ్ : ప్రతిష్టాత్మక ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తొలిరౌండ్లోనే ఇంటిబాట పట్టారు. బుధవారం ఇక్కడ జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడీ.. 21-23, 12-21తో మలేషియా ద్వయం ఆరోన్ టై, ఖాంగ్ కాయ్ జింగ్ చేతిలో ఓడింది.
తొలి గేమ్‌లో 20-20 వద్ద ఉన్నప్పటికీ మలేషియా జోడీ దూకుడుగా ఆడి కీలక పాయింట్లతో గేమ్‌ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్‌లో పోరు ఏకపక్షమే అయింది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, రుత్విక గద్దె జంట కూడా తొలిరౌండ్లోనే నిష్క్రమించింది.