సూర్యాపేట, మార్చి 4(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులపై దాడులకు తెగబడితే సహించేది లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట లో మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గొడవలు సృష్టిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులకుదిగే పద్ధతి మార్చుకోవాలని సూచించా రు. మూడురోజుల క్రితం 24, 26వ వార్డు ల్లో, రెండురోజుల క్రితం 9వ వార్డులో వ రుసదాడులకు దిగడంపై మండిపడ్డారు. 9వ వార్డులో నాగభూషణం ఇంటిపై దాడిచేయగా ఆయన కుమారుడికి గాయాలయ్యాయని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి వెళ్తుండగా నీలాల లక్ష్మయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
26వ వార్డులో సంకటి లింగరాజు, 24వ వార్డులో బత్తుల జానీపై గొడ్డలితో దాడికి యత్నించగా తృటిలో తప్పించుకున్నారని తెలిపారు. 40వ వార్డులో మాజీ కౌన్సిలర్ తాహేర్ ఇంటి ఎదుట ఉన్న బైక్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులు విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ దాడులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న నీలాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో వెళ్లి పరామర్శించానని ప్రస్తుతం లక్ష్మయ్య కోమాలో ఉన్నాడని వైద్యులు పేర్కొన్నారని వెల్లడించారు.