ఢిల్లీ : ప్రేగ్ చెస్ మాస్టర్స్‌లో వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మూడో పరాభవాన్ని చవిచూశాడు. టోర్నీలో దారుణంగా విఫలమవుతున్న అతడు.. ఆరో రౌండ్లో సహచర ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ అరవింద్ చిదంబరం చేతిలో ఓడిపోయాడు.
ఈ ఓటమితో అతడు పది మంది ఆటగాళ్లు పాల్గొంటున్న టోర్నీలో 1.5 పాయింట్లతో చిట్టచివరి స్థానంలో నిలిచాడు. మరో 3 రౌండ్లు మాత్రమే మిగిలున్న ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌కు చెందిన జోర్డెన్ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.