CC Cameras | రాయపోల్, మార్చి 03 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన నాలుగు కమ్యూనిటీ సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ టౌన్ సీఐ రవి కుమార్, బేగంపేట ఎస్ఐ డి. మహిపాల్ రెడ్డి, విపిఓ బి. ప్రేమరాజ్, ఏఎస్ఐలు హాజరై సీసీ కెమెరాలను ఆవిష్కరించారు.
గ్రామ సర్పంచ్ మద్దా గీతా ప్రవీణ్, ఉప సర్పంచ్, మంకిడి స్వామి, వార్డు సభ్యులు, దాతలు, గ్రామ ప్రజల సమక్షంలో కార్యక్రమం జరిగింది.
గ్రామంలో భద్రతా పరిరక్షణను బలోపేతం చేయడం, చోరీలు, ఇతర అనైతిక చర్యలను అరికట్టడం లక్ష్యంగా ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, భద్రతా వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని.. ప్రతీ గ్రామంలో ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరాలు జరగవని వారు పేర్కొన్నారు. ఒక సీసీ కెమెరా వంద మందితో సమానమని. అంత టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. బేగంపేట గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. రాయపోల్ మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని పేర్కొన్నారు.
Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!