Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!
Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందనే విశ్వాసం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది.
Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందనే విశ్వాసం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ను మేకర్స్ విడుదల చేశారు. అయితే కేవలం ఆడియో రూపంలో మాత్రమే సాంగ్ విడుదల కావడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ కోసం ఎదురు చూసిన అభిమానులకు లిరికల్ లేదా వీడియో సాంగ్ రాకపోవడం చిన్న నిరుత్సాహమే అయినప్పటికీ, పాట మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
ఈ సాంగ్‌ను పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేశారు. తెలుగులో ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా స్వరపరచి స్వయంగా ఆలపించారు. మ్యూజిక్‌లో యాక్షన్ మూడ్, ఎమోషనల్ అండర్‌టోన్ కలగలిపిన శైలి కనిపిస్తోందని సంగీత ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ‘టాక్సిక్’లో యష్‌కు జోడీగా కియారా అద్వాని నటిస్తుండగా, కీలక పాత్రల్లో నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తారాగణం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యష్ ‘KGF’ సిరీస్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ మేకింగ్ కలగలిసిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను మరోసారి షేక్ చేస్తుందా? అన్నది చూడాలి. మొత్తానికి ‘తబాహి’ సాంగ్‌తో ‘టాక్సిక్’ మ్యూజికల్ జర్నీ ప్రారంభమైంది. త్వరలో విజువల్ సాంగ్ విడుదలైతే అంచనాలు మరింత పెరగడం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

