మనోళ్లూ దీటుగానే..
తొలి రోజు ఆరంభంలో బంతితో అదరగొట్టి ఆ తర్వాత డీలా పడి న్యూజిలాండ్‌కు భారీ స్కోరు ఇచ్చుకున్న భారత్ బ్యాటుతో దీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (89 బంతుల్లో 16 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్ (116 బంతుల్లో 5 ఫోర్లతో 52 బ్యాటింగ్) న్యూజిలాండ్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కోవడంతో తొలి టెస్టులో రెండో రోజు శుక్రవారం ఆట చివరకు భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.
- మెరిసిన జైస్వాల్, రాహుల్.. భారత్ 159/1
- న్యూజిలాండ్ 368 ఆలౌట్
- నికోల్స్ భారీ ఇన్నింగ్స్.. ఫిలిప్స్ శతకం
వెల్లింగ్టన్: తొలి రోజు ఆరంభంలో బంతితో అదరగొట్టి ఆ తర్వాత డీలా పడి న్యూజిలాండ్‌కు భారీ స్కోరు ఇచ్చుకున్న భారత్ బ్యాటుతో దీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (89 బంతుల్లో 16 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్ (116 బంతుల్లో 5 ఫోర్లతో 52 బ్యాటింగ్) న్యూజిలాండ్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కోవడంతో తొలి టెస్టులో రెండో రోజు శుక్రవారం ఆట చివరకు భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్ (16 బ్యాటింగ్) ఉన్నాడు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు గిల్ సేన 209 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు 243/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజే శతకబాదిన హెన్రీ నికోల్స్ (335 బంతుల్లో 21 ఫోర్లతో 175 నాటౌట్) భారీ ఇన్నింగ్స్‌తో సత్తా చాటగా, గ్లెన్ ఫిలిప్స్ (118) కూడా సెంచరీతో ఆతిథ్య జట్టుకు మంచి స్కోరు అందించాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, ఆకాశ్ దీప్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆటలో ప్రస్తుతానికి ఇరు జట్లూ సమంగా ఉన్నాయి. భారత్ మూడో రోజంతా బ్యాటింగ్ చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించొచ్చు.
ఓపెనర్ల జోరు
బ్యాటర్లకు అనుకూలంగా కనిపిస్తున్న పిచ్‌పై భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి నాలుగు ఓవర్లలో పరుగులేమీ చేయలేదు. అయితే టీ బ్రేక్ అనంతరం బ్లాక్‌క్యాప్స్ బౌలింగ్‌ను కచ్చితమైన షాట్లతో ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 130 పరుగులు జోడించారు. తర్వాత భారత్‌కు ఇదే తొలి సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యం. కివీస్ పేసర్ మాథ్యూ హెన్రీ తొలి స్పెల్‌ను జాగ్రత్తగా ఎదుర్కొన్న తర్వాత కవర్ డ్రైవ్‌లు, ఆఫ్ డ్రైవ్‌లతో జైస్వాల్ పరుగులు రాబట్టాడు. ఆపై హెన్రీ, జేమీసన్, నేథన్ స్మిత్ షార్ట్ బంతులతో సవాల్ విసిరినా థర్డ్‌మ్యాన్ మీదుగా ర్యాంప్ షాట్లతో బదులిచ్చాడు. జైస్వాల్ వన్డే శైలిలో దూకుడుగా ఆడటంతో మరో ఎండ్‌లో రాహుల్ పక్కా టెస్టు ఆటతో అతనికి సహకారం అందించాడు. దాంతో భారత ఇన్నింగ్స్ నాలుగుకు పైగా రన్‌రేట్‌తో ముందుకెళ్లింది. అయితే శతకానికి 15 పరుగుల దూరంలో యశస్విని హెన్రీ ఔట్ చేశాడు. కీపర్ టామ్ బ్లండెల్‌ను స్టంప్స్‌కు దగ్గరగా నిలబెట్టిన కెప్టెన్ టామ్ లాథమ్ వ్యూహం ఫలించి యశస్వి క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్‌తో కలిసి మరో వికెట్ పడకుండా రాహుల్ రెండో రోజును ముగించాడు.
నికోల్స్ పది గంటలు క్రీజులో
మొదటి రోజే శతకం అందుకున్న నికోల్స్ అదే జోరును రెండో రోజూ కొనసాగించాడు. ఏకంగా పది గంటల పాటు క్రీజులో ఉన్న అతడిని భారత బౌలర్లు ఔట్ చేయలేకపోయారు. పిచ్ మృదువుగా మారి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేంత బౌన్స్, టర్న్ లభించకపోవడంతో భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. రెండో కొత్త బంతితో ఉదయం దాడిని ఆరంభించే బాధ్యత తీసుకున్న యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ నిరాశపరిచాడు. అతని బౌలింగ్‌లో కవర్ డ్రైవ్‌తో మూడు పరుగులు తీసిన ఫిలిప్స్ శతకం పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే అద్భుతమైన బంతితో ఫిలిప్స్ ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసిన ఆకాశ్ దీప్ ఆరో వికెట్‌కు 66 ఓవర్లలో 216 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని విడదీసి కాస్త ఊరటనిచ్చాడు. అయినా నికోల్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. నేథన్ స్మిత్ (14), జేమీసన్ (11) సహకారంతో స్కోరు 350 దాటించాడు. చివర్లో హెన్రీ (1)ని బుమ్రా, డఫీ (4)ని కాంబోజ్ వెంటవెంటనే ఔట్ చేయడంతో రెండో సెషన్ చివర్లో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కాగా, ప్రసిద్ధ్ కృష్ణ (1/100) పేలవ బౌలింగ్‌తో ఏకంగా వంద పరుగులు ఇచ్చుకున్నాడు.

ఒకే ఏడాది భారత్‌పై మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ కొట్టిన తొలి బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 121 ఓవర్లలో 368 ఆలౌట్ (నికోల్స్ 175 నాటౌట్, ఫిలిప్స్ 118, బుమ్రా 4/92, ఆకాశ్ 3/53). భారత్ తొలి ఇన్నింగ్స్: 39 ఓవర్లలో 159/1 (జైస్వాల్ 85, రాహుల్ 52 బ్యాటింగ్, హెన్రీ 1/43).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

