Home
National
Up Cm Yogi Adityanaths Mother Savitri Devi Passes Away At 91 In Uttarakhands Panchur Village
యోగి ఆదిత్యనాథ్‌కు మాతృ వియోగం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీదేవి శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లా స్వగ్రామం పాంచూర్లో మృతిచెందారు.
పౌరీ గఢ్వాల్, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీదేవి శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లా స్వగ్రామం పాంచూర్లో మృతిచెందారు. ఆమె వయస్సు 91 ఏండ్లు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న సావిత్రీదేవి శుక్రవారం ఉదయం సుమారు 10.45 గంటల సమయంలో మృతిచెందారని పాంచూర్ గ్రామస్థులు పీటీఐకి తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పాంచూర్కు చేరుకున్నారు. నేడు జరిగే అవకాశం ఉన్న తల్లి అంత్యక్రియల్లో ఆయన పాల్గొననున్నారు. తల్లి మృతి వార్త తెలిసిన తర్వాత ఆయన ఎక్స్‌లో ‘అమ్మ’ అని రాసి, ఆ తర్వాత ‘ఓం శాంతి’ అని పోస్టు చేశారు. సావిత్రీదేవికి ఏడుగురు సంతానం. ఆదిత్యనాథ్ రెండో కుమారుడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

