ఎమ్మెల్యే బాబు పాడె మోసిన విజయ్
తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్వయంగా పార్థివ దేహాన్ని మోశారు.
- అంత్యక్రియలకు హాజరు
చెన్నై, నవంబర్ 20: తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్వయంగా పార్థివ దేహాన్ని మోశారు. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు మృతదేహం ఉన్న పాడెను ఆయన నివాసం నుంచి అంత్య క్రియల వాహనం వరకు విజయ్ తన భుజాన మోశారు. గురువారం మరణించిన బాబుకు నివాళులర్పించిన విజయ్ శుక్రవారం జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు.
దీర్ఘకాలంగా దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో బాబు గురువారం కన్నుమూశారు. బాబు పార్థివ దేహాన్ని పెరంబూర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కోసం ఏర్పాటు చేసిన వాహనం వరకు మరో ముగ్గురితో కలసి విజయ్ తన భుజాలపై మోశారు. గతంలో డీఎంకే, ఏఐడీఎంకేలో పనిచేసిన బాబు ఈ ఏడాది ప్రారంభంలో టీవీకేలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఓడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

