TANA | ‘సుశ్రుత సంహిత’ వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక ఆయుర్వేద గ్రంథం.. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’లో వక్తలు
TANA | ‘ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత’ అనే అంశం మీద తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 94వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది.
TANA | డాలస్ (టెక్సస్) : తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలకు పైగా ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రపంచంలోనే వైద్యశాస్త్రానికి ఆద్యుడు – మహర్షి సుశ్రుత’ అనే అంశం మీద ఆదివారం జరిగిన 94వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది.
యునైటెడ్ కింగ్డమ్ లో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించగల్గడం అదృష్టంగా భావిస్తున్నామని, ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన ‘మహర్షి సుశ్రుత ఏ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ’ అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు తెలిపారు. వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన ‘సుశ్రుత సంహిత’ గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు..
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న ‘సుశ్రుత సంహిత’ అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. మనిషి సాధారణంగా 1,120 రకాల వ్యాధులకు గురిఅవుతాడని, 700 కు పైగా మొక్కల గురించి ఏ మొక్క, ఏ వ్యాధిని, ఎలా తగ్గిస్తుందో ప్రయోగాత్మకంగా నిరూపించాడు. 64 రకాల ఖనిజాలనుండి అవసరమైన మందులను ఎలా తయారుచేసుకోవచ్చో వివరించాడు. ఈ గ్రంథంలో 120 శస్త్రపరికరాల గురించి వివరించాడు.
ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే..! అనస్తీషియా ప్రక్రియకు ఆద్యుడు సుశ్రుతుడు. ప్రొస్టేట్ గ్రంథిని జాగ్రత్తగా తొలగించే పద్ధతి, విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు శస్త్రచికిత్స సూత్రాలు, తెగిన శరీర భాగాలను అతికించటం, అతి సున్నితమైన పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించగల్గడం, గర్భిణీస్త్రీ ఉదరంలో శిశువు పరిణామ క్రమం, కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజేరియన్ ఆపరేషన్లు చేసే విధానం, వ్యాధిరహితంగా ఉండేందుకు ఏ ఏ కాలాల్లో, ఎలాంటి కూరగాయలు, పండ్లు తినాలి, ఎలాంటి తృణధాన్యాలు, పప్పుదినుసుల వాడాలి అనే సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాట్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు.
నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో..
విశిష్ట అతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి (డెట్రాయిట్ నుండి) సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు (వెస్ట్ వర్జీనియా నుండి) సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ (వాషింగ్టన్ డి.సి నుండి) సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు.
అలాగే డా. పండరి గంటి (లాస్ ఏంజిల్స్ నుండి) సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింక్స్ ద్వారా వీక్షించవచ్చు.
Telugu one:
ETV:
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

