Isro Jobs | ఇస్రోలో 244 ఖాళీలు
Isro Jobs | ఇస్రోకు చెందిన వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 244 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ 130, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) 81, స్టెనోగ్రాఫర్ 10, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 82 ఖాళీలు ఉన్నాయి.
Isro Jobs | ఇస్రోకు చెందిన వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 244 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ 130, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) 81, స్టెనోగ్రాఫర్ 10, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 82 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో హైదరాబాద్‌లో 15, ఏపీలో 49 ఉన్నాయి.
అర్హతలు
అసిస్టెంట్, యూడీసీ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (Graduation)లో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.32 సీజీపీఏతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్లో పరిజ్ఞానం ఉండాలి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు డిగ్రీ లేదా కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు స్టెనో-టైపిస్ట్/స్టెనోగ్రాఫర్లో సంవత్సరం అనుభవ, ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఆగస్టు 16 నాటికి 28 ఏండ్లు నిండి ఉండాలి. ఓబీసీలకు 31, ఎస్సీ, ఎస్టీలకు 33 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. రూ. 500 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక, జీతం
రాత పరీక్ష (Written Test) ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500+ఇతర అలవెన్సులు ఇస్తారు.
చివరితేదీ
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు జూలై 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, హసన్, శ్రీహరికోట, అహ్మదాబాద్, తిరువనంతపురం, మహేంద్రగిరిల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ https://www.isro.gov.in/లో చూడవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

