అమరావతి : ఏపీలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ముగ్గురు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి . చిత్తూరు( Chittoor ) జిల్లా శాంతిపురం మండలం కడపల్లి వద్ద జాతీయ రహదారి వద్ద కుప్పం-పలమనేరు మార్గంలో తాగునీటి ట్యాంకర్ను , ద్విచక్రవాహానాన్ని టెంపో వాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి . బైక్పై వెళ్తున్న సుందరప్ప (60), ముని వెంకటమ్మ ( 50 ) మృతి చెందగా ట్యాంకర్ వద్ద నిలబడి ఉన్న నాలుగేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. గాయపడ్డ క్షతగాత్రులను స్థానికులు కుప్పం ఆసుపత్రికి తరలించారు.