న్యూఢిల్లీ: చీఫ్ ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ తన విధుల నుంచి తప్పుకోవాలని ఇవాళ విపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్ నుంచి నిర్వాచన్ భవన్ వరకు ర్యాలీ చేపట్టాయి. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ ప్లకార్డు పట్టుకుని ర్యాలీ తీశారు. జ్ఞానేశ్.. ఇట్స్ డన్.. బ్రో.. టైం టు రిజైన్ అంటూ రాసిన ప్లకార్డును ఆయన పట్టుకున్నారు. వోట్ చోర్.. గద్దీ చోడ్ అన్న ప్లకార్డును కూడా కాంగ్రెస్ నేతలు పట్టుకుని ర్యాఈ తీశారు. మార్చింగ్ చేసిన కాంగ్రెస్ నేతలు ఆకాశవాణి భవన్కు చేరుకున్నారు. విపక్ష నేత రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీలు ఓ దశలో పోలీసు బ్యారికేడ్లను ఎక్కారు. ఓ బ్యారికేడ్పై నిలబడి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఊపారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇండియా కూటమి నేతలు అఖిలేశ్ యాదవ్, డెరిక్ ఒబ్రెయిన్, అభిషేక్ బెనర్జీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈసీ ఆఫీసు వద్ద కూటమి నేతలు కొందరు ధర్నాకు దిగారు. సర్ ప్రక్రియ సమయంలో అక్రమ రీతిలో ఓట్ల తొలగింపు జరిగినట్లు విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ మకర ద్వారం నుంచి విపక్ష నేతలు ర్యాలీ ప్రారంభించారు. ఆకాశవాని భవన్ వద్ద విపక్ష బృందాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ రాహుల్, ప్రియాంకా ధర్నాలో కూర్చున్నారు. సెంట్రల్ ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Gyanesh, it’s done, bro.
Time to resign.
#IndiaAllianceMarch https://t.co/9ZB6aJfakl
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2026