లక్నో: భర్త తన ప్రియురాలితో కలిసి మోమోలు తింటుండగా భార్య పట్టుకున్నది. అయితే కారులో పారిపోయేందుకు అతడు ప్రయత్నించాడు. కారు బానెట్‌పై భార్య ఉన్నప్పటికీ అతడు ఆపలేదు. దీంతో కదులుతున్న కారు ముందు భాగంపై ప్రమాదకరంగా ఆమె వేలాడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Husband Drags Wife On Car Bonnet) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం మయాంక్ అనే వ్యక్తి తన ప్రియురాలైన మహితో కలిసి కారులో మోమోలు తినసాగాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య సునీత అక్కడకు చేరుకున్నది. మరో మహిళతో తన భర్తను చూసి ఆమె ఆగ్రహానికి గురైంది.
కాగా, భార్య సునీతను చూసిన మయాంక్, కారు డోర్ లాక్ చేశాడు. ప్రియురాలితో కలిసి కారులో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే సునీత కారుకు అడ్డుగా వచ్చి బానెట్‌ను గట్టిగా పట్టుకున్నది. అయినప్పటికీ మయాంక్ కారును ఆపలేదు. సుమారు వంద మీటర్ల దూరం వరకు నడిపాడు. ఈ నేపథ్యంలో కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడిన సునీత సహాయం కోసం కేకలు వేసింది. తనను కాపాడాలని ఆమె అరిచింది.
మరోవైపు స్పందించిన స్థానికులు ఆ కారు ముందు గుమిగూడి అడ్డుకున్నారు. దీంతో మయాంక్ చివరకు తన కారును ఆపాడు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మయాంక్, అతడి ప్రియురాలైన మహిని అరెస్ట్ చేశారు. ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు దాడి, కట్నం కోసం వేధింపులు, వివాహేతర సంబంధం, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే భార్యను కారు బానెట్‌పై భర్త ఈడ్చుకెళ్లిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨SHOCKING | Man drives his wife on bonnet of his car after she caught him with another woman in Meerut https://t.co/JFPU9Pn5KZ
— The Tatva (@thetatvaindia) October 4, 2026