Iran vs Ukraine | ఉక్రెయిన్‌కు తగిన శాస్తి చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Iran vs Ukraine | కాస్పియన్ సముద్రం (Caspian Sea) లో ప్రయాణిస్తున్న తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ బలగాలు (Ukraine forces) జరిపిన దాడిలో ఒక నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నావికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దాడిపై ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. తమ దేశ భద్రతను ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడబోమని స్పష్టంచేసింది.
Iran vs Ukraine : కాస్పియన్ సముద్రం (Caspian Sea) లో ప్రయాణిస్తున్న తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ బలగాలు (Ukraine forces) జరిపిన దాడిలో ఒక నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో నావికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ దాడిపై ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. తమ దేశ భద్రతను ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడబోమని స్పష్టంచేసింది. ఈ చర్యకు పాల్పడిన ఉక్రెయిన్‌కు రాబోయే రోజుల్లో తగినశాస్తి జరుగుతుందని, యుద్ధం మరింత ముదరకుండా చూడాలంటే కీవ్ వైఖరిని ఐరోపా దేశాలు వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేసింది.
పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తమకు రష్యా-ఉక్రెయిన్ పోరుతో ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ పదేపదే చెబుతున్నప్పటికీ.. రష్యా నుంచి ఇరాన్ శాటిలైట్ సమాచారాన్ని పొందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. గల్ఫ్ ప్రాంతాలు అమెరికా మిలిటరీ స్థావరాలపై రష్యా సేకరించిన ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ తన దాడుల కోసం వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. అమెరికా విధించిన ఆంక్షలవల్ల చైనా తదితర దేశాల నుంచి వస్తువుల రవాణాకు ఇరాన్‌కు ఈ కాస్పియన్ సముద్ర మార్గమే దిక్కుగా మారింది. అలాంటి కీలకమైన దారిలో నౌకపై దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
ఇదిలావుంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తోపాటు చెర్నిహివ్, ఖార్కివ్ నగరాలపై రష్యా ఆదివారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా ఏడు బాలిస్టిక్ మిస్సైళ్లు 136 ఆత్మాహుతి డ్రోన్లతో రష్యా వైమానిక దాడికి తెగబడినట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. ఈ దాడిలో ఆరుగురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

