పాట్నా: ఇంజినీరింగ్ వంటి పెద్ద చదువులు అతడు చదవలేదు. వాహనాలు రిపేర్ చేసే షాపు నిర్వహిస్తున్నాడు. అయితే తన తెలివితేటలతో ఎలక్ట్రిక్ జీప్ తయారు చేశాడు. దీనికి కేవలం లక్ష మాత్రమే ఖర్చు చేశాడు. (Man Makes Electric Jeep) బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముర్షిద్ ఆలం వాహనాలు రిపేర్ చేసి జీవిస్తున్నాడు. గ్రామాల్లోని రైతులు, చిరు వ్యాపారులకు సరైన రవాణా లేక ఇబ్బందులు పడుతుండటాన్ని అతడు గమనించాడు. దీంతో తక్కువ ఖర్చుతో తయారయ్యే వాహనంపై దృష్టిసారించాడు.
కాగా, గ్రామస్తులు, రైతుల అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని ముర్షిద్ ఆలం భావించాడు. దీంతో ట్యూబ్‌లెస్ టైర్లు, స్పీడోమీటర్, పవర్ స్టీరింగ్, ఛార్జింగ్ పాయింట్‌తో కూడిన ఎలక్ట్రిక్ జీప్‌ను కేవలం 18 రోజుల్లో తయారు చేశాడు. దీని కోసం లక్ష ఖర్చు చేశాడు. ముందు వైపు ఇద్దరు, వెనుక ముగ్గురు కూర్చొనేలా ఐదు సీట్లున్న ఎలక్ట్రిక్ జీపును నడిపి అందరిని ఆకట్టుకున్నాడు.

Man Makes Electric Jeep
మరోవైపు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుందని ముర్షిద్ ఆలం తెలిపాడు. ఆ తర్వాత సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చని చెప్పాడు. రైతులు తమ పంటలు, ఎరువులు, ఇతర వస్తువులను తీసుకెళ్లడం కోసం అదనపు ట్రాలీని కూడా ఈ మినీ ఎలక్ట్రిక్ జీప్‌నకు అటాచ్ చేయవచ్చని వివరించాడు.
Also Read:
Contaminated Water | నిన్న ఇండోర్, నేడు నోయిడా.. కలుషిత తాగునీటి వల్ల పలువురు అనారోగ్యం
Man Killed in Police Firing | పొరుగువారిపై కత్తితో దాడి.. పోలీస్ కాల్పుల్లో వ్యక్తి మృతి
Watch: లారీ డ్రైవర్లను బెదిరించి.. డబ్బులు వసూలు చేస్తున్న మహిళలు