జైనథ్, మార్చి 8 ః రైతుబంధు పథకాన్ని విమర్శించే నైతిక హకు సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, పేదవారి ఇండ్లు కూల్చడమే కాకుండా రైతు సంక్షేమ పథకాన్ని కూడా మాయం చేస్తుండు అని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ ఆకోలి గ్రామంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతు కుటుంబాన్ని కలుస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. రైతులు ఎదురొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకొని వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంఆ జోగు రామన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాయల శంకర్ రైతుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రక్షణ బీఆర్ఎస్ పార్టీ నిరసన ఆందోళన కార్యక్రమాలను చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. రైతులు అధైర్య పడవద్దని రైతులకు న్యాయం జరిగేలా ప్రతి రైతు కుటుంబంతో సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్‌ను కలవడం జరుగుతుందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతుబంధు నిధులు విడుదల చేసేలా రైతు గళం అసెంబ్లీకి తాకేలా ముందుకు పోవడం జరుగుతుందని పేరొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఊశన్న, మెట్టు ప్రహ్లాద్, కేశవ్, పురుషోత్తం, నారాయణ, మహేశ్, ప్రభాకర్, దత్తు, రమేశ్, భోజన్న, దేవిదాస్ పాల్గొన్నారు.