ఆధార్, ఓటరు కార్డులు పౌరసత్వ రుజువులు కావు
ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్బుక్ భారత పౌరసత్వాన్ని నిర్ధారించే నిశ్చయాత్మక రుజువులు కావని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ పౌరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి నిర్బంధం విషయంలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానం నిరాకరించింది.
- కలకత్తా హైకోర్టు తీర్పు
కోల్కతా: ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్బుక్ భారత పౌరసత్వాన్ని నిర్ధారించే నిశ్చయాత్మక రుజువులు కావని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ పౌరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి నిర్బంధం విషయంలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానం నిరాకరించింది. తన మేనల్లుడిని అక్రమంగా ఈ ఏడాది జూన్ 18 నుంచి నిర్బంధించారని ఆరోపిస్తూ, అతడిని విడిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అతని అంకుల్గా పేర్కొంటూ ఒక వ్యక్తి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అతడి పిటిషన్ను జస్టిస్లు దేబాంగ్స్ బసక్, అజయ్ కుమార్ గుప్తాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. అదుపులో ఉన్న వ్యక్తి, పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులు తమ భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేసే పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

