IND vs WI : వన్డే ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌ను భారత జట్టు ఘనంగా మొదలెట్టింది. తిరువనంతపురంలో శివాలెత్తిన విరాట్ కోహ్లీ(139 నాటౌట్) వన్డేల్లో 55వ శతకంతో రెచ్చిపోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(110) సెంచరీతో వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టాడు. రెండో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యంతో గెలుపు పునాది వేశారిద్దరూ. బౌండరీలతో దడ పుట్టించిన ఈ జోడీ విధ్వంసంతో 296 పరుగుల లక్ష్యం మంచు ముక్కలా కరిగిపోయింది. అలవోకగా గెలుపొందిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో అదిరే బోణీ కొట్టింది.
స్వదేశంలో తామెంత ప్రమాదకరమో మరోసారి చాటింది భారత జట్టు. వెస్టిండీస్‌తో మూడు వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(139 నాటౌట్) శతక విధ్వంసానికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్(110) మెరుపులు తోడవ్వగా భారీ విజయం సాధించింది టీమిండియా. విండీస్ నిర్దేశించిన 296 పరుగుల ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(32) ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. బౌండరీ వద్ద అల్జారీ జోసెఫ్ క్యాచ్ జారవిడవంతో బతికిపోయిన హిట్‌మ్యాన్ పెద్ద స్కోర్ చేయలేదు. అతడు త్వరగా ఔటైనా గిల్ దూకుడైన ఆటతో స్కోర్ బోర్డును ఉరికించాడు. తనదైన షాట్లతో అలరిస్తూ.. ఈ ఫార్మాట్లో 21వ ఫిఫ్టీ సాధించాడు గిల్.
5⃣0⃣ up with a 6⃣ 👌
1⃣0⃣0⃣ up with a 6⃣ 💪Virat Kohli meant business tonight 🔥
Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/mM52R4r2nF
— BCCI (@BCCI) September 27, 2026
రోహిత్ ఔటయ్యాక విరాట్ కోహ్లీ(139 నాటౌట్) జతగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అల్జారీ ఓవర్లో సిక్సర్‌తో విరాట్ యాభై పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని విడదీశాడు. గిల్ ఔటయ్యాక మరింత రెచ్చిపోయిన కోహ్లీ.. రోస్టన్ చేజ్ ఓవర్లో కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. మోతీ ఓవర్లో బంతిని లాంగ్ ఆన్‌లో స్టాండ్స్‌లోకి పంపిన విరాట్.. వన్డేల్లో 55వ శతకం అందుకున్నాడు. సెంచరీ తర్వాత భీకరంగా ఆడిన కోహ్లీ.. కార్టీ వేసిన 42వ ఓవర్లో సిక్సర్‌తో మ్యాచ్నుముగించాడు. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో సూపర్ బోణీ చేసింది.
భారత పర్యటన తొలి వన్డేల్లో వెస్టిండీస్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తిరువనంతపురంలో జస్టిన్ గ్రీవ్స్(107), జాన్ క్యాంప్‌బెల్(62)లు ఖతర్నాక్ బ్యాటింగ్‌తో అలరిస్తూ శతక భాగస్వామ్యం నెలకొల్పారు. టీమిండియా బౌలర్లను కాచుకున్ ఈ ద్వయం దూకుడుగా ఆడడంతో విండీస్ స్కోర్ పరుగులు తీసింది. క్రీజులో పాతుకుపోయిన క్యాంప్‌బెల్‌ను పెవిలియన్ పంపిన కుల్దీప్ యాదవ్(4-40) తొలి వికెట్ అందించాడు. 20వ ఓవర్లో అతడు ఫ్లయిట్ చేసిన రెండో బంతిని స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ప్రసిధ్ కృష్ణకు దొరికాడు. దాంతో.. 135 వద్ద తొలి వికెట్ పడింది.
కుల్దీప్ (4-40), గ్రీవ్స్(107)

అనంతరం కేసీ కార్టీ(13), కెప్టెన్ షాయ్ హోప్(12)లు క్రీజులో నిలవలే. ఓవైపు వికెట్లు పడుతున్నా.. సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన గ్రీవ్స్ 104 బంతుల్లో 12 ఫోర్లతో తొలి శతకం సాధించాడు. భారత గడ్డపై వంద కొట్టిన 13వ కరీబియన్ బ్యాటర్‌గా రికార్డు సాధించిన అతడిని సైతం కుల్దీప్ బోల్తా కొట్టించాడు. 36వ ఓవర్లో మూడో బంతికి గ్రీవ్స్ ఎల్బీగా ఔటవ్వగా.. తర్వాతి బంతికే ఆండ్రూ(0) స్లిప్‌లో రోహిత్ చేతికి చిక్కాడు. కుల్దీప్ హ్యాట్రిక్‌పై నిలవగా రోస్టన్ ఛేజ్(24).. అందుకు అవకాశమివ్వలే. ఆపై అమిర్ జంగూ(58 నాటౌట్) జతగా ఛేజ్ ఐదో వికెట్‌కు యాభై రన్స్ జోడించాడు. ప్రసిధ్ ఓవర్లో ఛేజ్ క్లీన్ బౌల్డయ్యాక వేగం పెంచిన జంగూ 38 బంత్లులోనే ఫిఫ్టీ సాధించాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో పరుగులు చేసింది.