South Africa : దక్షిణాఫ్రికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు ప్రధాన నగరాల్లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో 27 మంది వరకు మరణించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్ పట్టణాల్లో ఈ కాల్పులు జరిగాయి. జోహన్నెస్‌బర్గ్‌లో శనివారం రాత్రి కాల్పులు జరగగా.. కేప్ టౌన్లో ఆదివారం వేకువఝామున ఈ కాల్పులు జరిగాయి.
నైరుతి జోహన్నెస్‌బర్గ్ పరిధి, వెడెలా టౌన్షిప్లో శనివారం రాత్రి ఎనిమిది మంది సాయుధులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 17 మంది మరణించారు. ఒక బార్ బయట వరుసగా కాల్పులు జరపడంతో 17 మంది మరణించారు. ఈ ఘటనలో 13 మంది పురుషులు, నలుగురు స్త్రీలు ఉన్నారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. కేప్‌టౌన్‌లోని ల్వాండిల్ టౌన్షిప్ పరిధిలోని స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. 11 మంది గాయపడ్డారు.
అర్ధరాత్రి 1.00 గంటలకు ఈ ఘటన జరిగింది. వీరిలో ఒక గర్భిణి కూడా ఉంది. ఆయుధాలు కలిగిన అనేక మంది ఈ కాల్పులకు పాల్పడ్డట్లు తెలిసింది. కాల్పులకు పాల్పడ్డ వారి గురించి పోలీసులు వెతుకుతున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.