న్యూఢిల్లీ: భారత జాతీయ గేయమైన వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే చట్టం-1971’ సవరణ బిల్లును రాజ్యసభ బుధవారం అమోదించింది.
ఈ బిల్లు ఆమోదంతో ఇక వందేమాతరానికి కూడా జాతీయగీతం జనగణమనతో సమానమైన చట్టపరమైన రక్షణ లభించనుంది. వందేమాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించినా, అగౌరవపరిచినా, మూడేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించేలా ఈ చట్ట సవరణను రూపొందించారు.