జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. స్వల్ప చర్చ తర్వాత గందరగోళం మధ్య లోక్సభ ఈ చట్టాన్ని ఆమోదించింది.
భారత జాతీయ గేయమైన వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే చట్టం-1971’ సవరణ బిల్లును రాజ్యసభ బుధవారం అమోదించింది.