న్యూఢిల్లీ: విమానం గాలిలో ఎగురుతుండగా శ్వాస తీసుకోవడంలో శిశువుకు ఇబ్బంది ఎదురైంది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించారు. ఒక ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ శిశువును వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. (Infant Breathing Issues Mid-Air) జనవరి 6న రాత్రి వేళ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం జైపూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది.
కాగా, ఆ విమానం గాలిలో ఎగురుతుండగా ఏడాది వయస్సున్న శిశువుకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. అందులో ప్రయాణిస్తున్న డాక్టర్, విమాన సిబ్బంది సహాయంతో సీపీఆర్ చేశారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌లోని ఏటీసీ అనుమతిని పైలట్లు కోరారు. రాత్రి 8 గంటల సమయంలో ఆ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
మరోవైపు అప్పటికే అందుబాటులో ఉంచిన అంబులెన్స్ ద్వారా ఆ శిశువును వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ శిశువు మరణించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. ఆ శిశువు కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.
Also Read:
Suresh Pasi | ‘ముస్లింల ఓట్లు అవసరం లేదు’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Best City for Women | 2025లో మహిళలు మెచ్చిన.. దేశంలోని బెస్ట్ సిటీ ఇదే
Man Makes Electric Jeep | లక్ష వ్యయంతో.. ఎలక్ట్రిక్ జీప్ తయారు చేసిన వ్యక్తి
Contaminated Water | నిన్న ఇండోర్, నేడు నోయిడా.. కలుషిత తాగునీటి వల్ల పలువురు అనారోగ్యం