శివ్వంపేట, మర్చి 11: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్లాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (20) అదే గ్రామానికి చెందిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.