స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు.
రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. కాంగ్రెస్ రాజ్యాంగమని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతికి స్పీకర్ తీర్పు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును కాలరాసి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్, కూతుర్ని కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి, కండువా వేసుకుని తిరిగి చేతి గుర్తుకు ఓటేయమని కోరిన కడియం శ్రీహరికి క్లీన్చిట్ ఇవ్వడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.
నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలును గాలికి వదిలేయడమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా గాలికి వదిలేశాడని నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నిధుల దోపిడీకి ఇక్కడ అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారు. అందుకే ఇక్కడి పరిణామాలపై, ఇక్కడి ప్రభుత్వ అరాచకాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నోరెత్తడం లేదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

