బోథ్, మార్చి 8 : భూగర్భ జలాలు అడుగం టి పోయాయి. బోరుబావుల్లోని మోటార్లు మొరాయిస్తున్నాయి. పంటలు ఎండుముఖం ప డుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లో యాసంగి కింద రైతులు వివిధ రకాల పంట లు వేశారు. శనగలు 3100 ఎకరాలు, మక్క 3 వేలు, జొన్న 8700, నువ్వులు 250, గోధుమ లు 450, ఇతర పంటలు 110 ఎకరాలు మొ త్తం కలిపి 15,610 ఎకరాల్లో సాగు చేస్తున్నా రు. శనగ పంట దాదాపుగా కోతలు పూర్తయ్యే దశలో ఉంది. ప్రస్తుతం జొన్న, గోధుమలు, ను వ్వులు, మక్క పంటలకు ప్రస్తుతం నీటి తడులు అత్యవసరం. ఈ సమయంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాగులపై ఆధారపడి పంటలు వేసిన రైతులు తమ కళ్లెదుటే ఎండి పోవడంతో ఏమీ చేయలేక పోతున్నారు. మరోవైపు బోరుబావుల్లో పూర్తిగా నీరు అడుగంటి ఒకటి, రెండు స్పింక్లర్లు మాత్రమే పని చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కంకి దశలో ఉన్న మక్క, ఈనే దశలో(కంకి బయటకు రావడం) ఉన్న జొన్న, పూత దశలో ఉన్న నువ్వులు ఎండి పోతుండడంతో ఏమీ చేయలేక పోతున్నారు. మరోవైపు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో నీరున్న కొద్ది మంది రైతులు తడులు పెట్టుకోలేక పోతున్నారు. వానకాలం పంటలైన పత్తి, సోయా ఈ యేడు ఆశించిన స్థాయిలో పండకపోవడంతో యాసంగి పంటలతోనైనా ఆ లోటు పూడ్చుకుందామనుకున్న రైతుల ఆశలకు భూగర్భ జలాలు అడుగంటి పోయి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.