Farmers | నర్సింహులపేట, మార్చి 8 : ఓ వైపు యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందక అ న్నదాతలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సాగునీరు చుట్టపు చూపుగా వస్తుండటం తో పంటలు ఎండిపోయేలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల శివారు నుంచి ప్రవహిస్తున్న ఆకేరువాగు పూర్తిస్థాయిలో ఎండిపోవడంతో యాసంగిలో సాగు చేసిన వరి పొలా లు పండే అవకాశం లేకుండా పోయింది.
న ర్సింహులపేటలోని పెద్ద చెరువు, రామన్నగూడెం గణేశ్ చెరువు, ముంగిమడుగు వెంక మ్మ చెరువులతోపాటు కౌసల్యదేవిపల్లి, కొ మ్ములవంచ, జయపురం, పడమటిగూడెం చె రువులు, కుంటలకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగు నీరు రావ డం లేదు. కాలువలు సక్రమంగా లేకపోవడంతోపాటు ఉన్న వాటి లో చెత్తా చెదారం పేరుకుపోయింది. గెలిచిన నెల రోజుల్లోనే నర్సింహులపేట మండల కేం ద్రానికి నేరుగా కాలువ ద్వారా చెరువులు, కుంటలు నింపుతామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజా ప్రతినిధులు, చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి.
చేతికొచ్చే దశలో వరి ఎండిపోతాయని వాపోతున్నారు. రూప్లాతండా జీపీ పరిధిలోని రైతు గుగులోత్ విజయ తన పొలంలో క్రేన్ సాయంతో బావి తీయిస్తున్నా డు. రూ.20 వేలు ఖర్చు చేసి బావి తీసినా ఫలితం లేదని వాపోయాడు. ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులు స్పందించి వారానికి ఒకసారైనా ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు విడుదల చేస్తే చెరువులు, కుంటలు నిండుతాయని, చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.