Chain Snatching | మహిళను కిందపడేసి, రోడ్డుపై ఈడ్చి గొలుసు లాక్కెళ్లిన దుండగులు..Video
Chain Snatching | కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఇద్దరు బైకర్లు రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళపై దాడిచేసి 25 గ్రాముల బంగారాన్ని లాక్కెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న మహిళను బైక్పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు.
Chain Snatching : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో దారుణం జరిగింది. ఇద్దరు బైకర్లు (Bikers) రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళపై దాడిచేసి 25 గ్రాముల బంగారాన్ని లాక్కెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న మహిళను బైక్పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు. ఆమెను కిందపడేసి, మెడలోని 25 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన దొడ్డబిదరకల్లు ప్రాంతంలో జరిగింది.
బాధితురాలు విజయమ్మ దొడ్డబిదరకల్లు ప్రాంతంలో పాల దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడిచేశారు. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కున్నారు. దుండగులు లాగడంతో విజయమ్మ కిందపడిపోయారు. సహాయం కోసం గట్టిగా కేకలు వేశారు. అయితే తెల్లవారుజాము కావడంతో చుట్టుపక్కల ఎవరూ లేరు.
ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. బైక్పై వచ్చిన వ్యక్తులు మహి దాడిచేసి, నగలతో పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
CCTV captures brutal chain snatching in Bengaluru
A woman was assaulted and robbed of her 25 gram mangalsutra by two bike borne men near Doddabidarakallu in Peenya.
The victim, Vijayamma, was walking to a shop around 5:10 AM when the pillion rider attacked her, dragged her to… pic.twitter.com/FZ4wC8tNDN— Imran Khan (@KeypadGuerilla) August 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

