Harbhajan Singh | వయసు కాదు ఆటే కొలమానం.. మెస్సీకి కోహ్లీ, రోహిత్ ఏమీ తీసుపోరు..!
Harbhajan Singh : పలువురు మాజీ ఆటగాళ్లు విరాట్, రోహిత్ అనుభవం భారత్‌కు కలిసొస్తుందని వాదిస్తున్నారు. తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ వెటరన్స్‌కు వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశాడు.
Harbhajan Singh : వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు ఆడడంపై ఇంకా స్పష్టత లేదు. దిగ్గజాలైన ఇద్దరిని మెగా టోర్నీలో ఆడించాలనే డిమాండ్లు వస్తున్నా సెలెక్టర్లు, బీసీసీఐ మాత్రం ఏదీ తేల్చట్లేదు. అయితే.. పలువురు మాజీ ఆటగాళ్లు విరాట్, రోహిత్ అనుభవం భారత్‌కు కలిసొస్తుందని వాదిస్తున్నారు. తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ వెటరన్స్‌కు వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశాడు.
భారత జట్టుకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే వరల్డ్‌కప్ ఆడాలని భావిస్తున్నారు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ స్టార్ ద్వయం..మెగా ఈవెట్తో వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి. అయితే.. వయసు 35 ప్లస్ దాటడంతో వీరిని పక్కనపెట్టి.. కుర్రాళ్లను తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు సెలెక్టర్లు. కానీ, అనుభవజ్ఞులైన ఇద్దరినీ ఆడించాలని మాజీలు అభిప్రాయపడుతుండగా.. పీటీఐ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్ కోసం ఆటగాళ్ల ఎంపికలో నిలకడ కొలమానం కావాలని అన్నాడు.
🚨Harbhajan Singh On Rohit & Virat’s 2027 World Cup Future🚨
Reporter:🗣️ When does a player realize that his career is coming to an end? Should we leave this decision to Rohit and Virat?
Harbhajan Singh: 🗣️ I think this decision should be left to Rohit and Virat. Even if they… pic.twitter.com/E3abWN9m7C
— Central Cricket (@arshdeep3444) August 13, 2026
‘ఆటగాళ్ల వయసు ముఖ్యం కాదు. వారు పరుగులు సాధిస్తున్నారా? నిలకడ ఉందా? అనేవి మాత్రమే చూడాలి. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ సమయానికి కోహ్లీకి 39 ఏళ్లు, రోహిత్‌కు నలభై వస్తాయి. ఫిట్‌నెస్‌లో రారాజైన విరాట్ ఇప్పటకీ మైదానంలో 20 ఏళ్ల కుర్రాళ్లతో పోటీపడగలడు. లియోనల్ మెస్సీని తీసుకోండి.. అతడికి 39. అయినా.. ఫిఫా వరల్డ్‌కప్‌లో మెరిశాడు. ఫిట్‌గా ఉన్న అతడిని మైదానంలో ఐదుగురు ప్రత్యర్థులు కూడా అడ్డుకోలేరు. వయసు కంటే నైపుణ్యమే పరిగణనలోకి తీసుకోవాలి.

ఆట, ఫిట్‌నెస్‌లో కోహ్లీ, విరాట్ అదరగొడుతున్నప్పుడు.. శ్రేయాస్ అయ్యర్, యశస్వీ జైస్వాల్ అవసరం ఉండదుగా. అలానే.. పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ నుంచి ఎక్కువగా ఆశించడం పొరపాటే అవుతుంది. కోహ్లీ, రోహిత్‌కు మూడొందల మ్యాచ్‌ల అనుభవుమంది. కాబట్టి.. వీరిని ఆడించడం టీమిండియాకు మంచిది’ అని భజ్జీ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా వరల్డ్‌కప్ మొదలవ్వనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

