పౌల్ట్రీకి సింగిల్‌విండో విధానంలో అనుమతులు
పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
- పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి హామీ
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రంగాన్ని ప్రాధాన్యత పరిశ్రమగా గుర్తించి, సమస్యల పరిషారానికి అవసరమైన విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో 2026ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతం ఆయన మాట్లాడుతూ…పౌల్ట్రీ పరిశ్రమ రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తూ వారి ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేస్తున్నదన్నారు.
ప్రతియేటా తెలంగాణలో 5.30 కోట్ల గుడ్ల ఉత్పత్తి అవుతున్నాయని, తద్వారా విద్యార్థులు, యువతకు పౌష్టికాహారం అందించడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని పేరొన్నారు. గ్రామపంచాయతీల పరిధిలో పౌల్ట్రీ ఫామ్‌ల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేలా మార్పులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రెండేండ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయని, అయితే పౌల్ట్రీ రంగానికి అవసరమైన మొకజొన్న కొరత సమస్య తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
దీనిని పరిషరించేలా సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

