తెలుగు సినిమా గర్వించే వృషకర్మ
‘వృషకర్మ’ వినూత్నమైన కథ. ఎప్పుడూ చూడని విజువల్స్ ఈ సినిమాలో ఉంటాయి. ప్రతీ ఫ్రేమ్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రమవుతుంది’ అన్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వృషకర్మ’.
‘వృషకర్మ’ వినూత్నమైన కథ. ఎప్పుడూ చూడని విజువల్స్ ఈ సినిమాలో ఉంటాయి. ప్రతీ ఫ్రేమ్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రమవుతుంది’ అన్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. డిసెంబర్ 4న విడుదలకానుంది. బుధవారం నెల్లూరులో ట్రైలర్‌ను విడుదల చేశారు. అతీంద్రియ శక్తులు, ట్రెజర్ హంటింగ్, వేద విజ్ఞానం నేపథ్య అంశాలతో ట్రైలర్ ఆసాంతం ఉత్కంఠను పంచింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ..దర్శకుడు కార్తీక్ దండు సరికొత్త విజన్‌తో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశాడని చెప్పారు. సినిమా విజయంపై ధీమాగా ఉన్నామని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

