డీజిల్‌కు కటకట..!
ఈ నెల మొదలు ఇప్పటిదాకా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 20 శాతానికిపైగా పడిపోయాయి.
- మార్కెట్లో ఇంకా తీరని కొరత
- డిమాండ్‌కు తగ్గట్టుగా లేని సరఫరా
న్యూఢిల్లీ, నవంబర్ 25: ఈ నెల మొదలు ఇప్పటిదాకా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 20 శాతానికిపైగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఈ వారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు 90 డాలర్ల దిగువకు చేరింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో ఇక హొర్ముజ్ జలసంధి మీదుగా ముడి చమురు రవాణా మరింతగా జరుగవచ్చన్న అంచనాలే ఇందుకు ప్రధాన కారణం. అయినప్పటికీ మిడిల్ ఈస్ట్ నుంచి డీజిల్ ఎగుమతులు డిమాండ్‌కు తగ్గట్టుగా సాగకపోవడం గమనార్హం.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముందుతో పోలిస్తే కొంత భాగానికే పరిమితమయ్యాయి. మరోవైపు ఉక్రెయిన్, రష్యాలు తమ రిఫైనరీలను తరచూ నిలిపివేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ ముఖ్యంగా రష్యా డీజిల్ ఎగుమతులు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే నెలల్లో డీజిల్ కొరత కొనసాగవచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేస్తున్నది. ప్రస్తుత చలికాలం దృష్ట్యా డీజిల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఇది కూడా డిమాండ్‌కు, సైప్లెకి మధ్య అంతరాన్ని పెంచుతున్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
ద్రవ్యోల్బణం ముప్పు..
ఇప్పటికే ఎల్ నినో కారణంగా వర్షాల్లేక దేశంలో ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. ఈ క్రమంలో డీజిల్ కొరత.. పరిస్థితుల్ని మరింతగా దిగజార్చవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రవాణా రంగం డీజిల్ వినియోగంపైనే అధికంగా ఆధారపడుతున్నదన్న విషయం తెలిసిందే. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ఇంధనం దొరుకకపోయినా.. అది ట్రాన్స్పోర్ట్ చార్జీలను ఎగదోస్తుందని అంటున్నారు. ఇది చివరకు అన్ని రకాల వస్తూత్పత్తుల ధరల్ని పెంచేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే వ్యవసాయ రంగంపై ఇంకా ఒత్తిడి పెరుగుతుందని, ఆహార ద్రవ్యోల్బణం కూడా ఎగబాకుతుందని, ఫలితంగా ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుతో రుణాల ఖరీదెక్కుతాయన్న ఆందోళనలు అటు ఇండస్ట్రీ నుంచి, ఇటు వినియోగదారుల నుంచి కనిపిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

