ట్విన్ టవర్..గ్రీన్ ఐకాన్!
ఐటీ కారిడార్‌లో శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్ పరిపాలనా అవసరాలకు తగ్గట్టుగా అత్యాధునిక హంగులతో కూడిన శాశ్వత ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎమ్సీ) శ్రీకారం చుట్టింది.
- రూ.169 కోట్లతో సీఎంసీ శాశ్వత ప్రధాన కార్యాలయం
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లో శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్ పరిపాలనా అవసరాలకు తగ్గట్టుగా అత్యాధునిక హంగులతో కూడిన శాశ్వత ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎమ్సీ) శ్రీకారం చుట్టింది. సుమారు రూ.169 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం సీఎంసీ ఈ-టెండర్లను ఆహ్వానించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్ నగర్‌లోని కొత్త కుంట చెరువు సమీపంలో 4.11 ఎకరాల విస్తీర్ణంలో ఈ నూతన భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. కాగా, పర్యావరణ హితమైన ‘నెట్-జీరో గ్రీన్ బిల్డింగ్’ కాంప్లెక్స్‌గా ఈ ప్రధాన కార్యాలయాన్ని తీర్చిదిద్దనున్నారు. మొత్తం 2,41,540 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో పరస్పరం అనుసంధానమై ఉండే రెండు భారీ టవర్లను (ట్విన్ టవర్స్) నిర్మిస్తారు. వీటిలో ఒక టవర్ జీ+6 అంతస్తులతో, మరొకటి జీ+8 అంతస్తులతో రూపుదిద్దుకోనుంది.
భవిష్యత్తు పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనికి రూపకల్పన చేశారు. కాగా ఒకే చోట సకల పౌర సేవలు అందించనున్నారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు వీలుగా ఈ కార్యాలయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. కౌన్సిల్ హాల్, ప్రజావాణి హాల్, ఆధునిక ఆడిటోరియం, విపత్తులు, నగర పర్యవేక్షణ కోసం సమీకృత కమాండ్ సెంటర్, పౌర సేవా కేంద్రాలు (సిటిజన్ సర్వీస్ సెంటర్లు), కార్పొరేషన్ వివిధ విభాగాలు, అనుబంధ ప్రభుత్వ సంస్థలకు ప్రత్యేక కార్యాలయాలు, పర్యావరణహిత సాంకేతికతకు పెద్దపీట, తెలంగాణలో ప్రభుత్వ మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఒక ఆదర్శంగా నిలిచేలా ఇందులో ఆధునిక గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీని వాడనున్నారు. పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు (సోలార్), ఇంధన పొదుపు మౌలిక సదుపాయాలు, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి మరియు పునర్వినియోగం, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ వంటివి ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సైబరాబాద్‌కు ఒక ఐకానిక్ సివిక్ ల్యాండ్ మార్గా నిలవనున్న ఈ ప్రాజెక్టు టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను tender.telangana.gov. in వెబ్ సైట్ లో పొందవచ్చని సీఎంసీ కమిషనర్ సృజన ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ తుది గడువు వచ్చే నెల 2గా నిర్ణయించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

