అహ్మదాబాద్: బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బైకర్ ప్రయత్నించాడు. అదుపుతప్పిన బైక్ రోడ్డుపై జారిపడింది. బైక్ నడిపిన వ్యక్తి పైనుంచి బస్సు దూసుకెళ్లింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Biker’s Attempt To Overtake Bus) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఆ బైక్ అదుపుతప్పింది. రోడ్డుపై జారి పడింది. బైక్ నడిపిన వజ్రాల తయారీదారుడైన 29 ఏళ్ల నికుంజ్ సవానీ ఆ బస్సు వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బైక్ వెనుక కూర్చొన్న కేతన్ స్వల్పంగా గాయపడ్డాడు. రాంగ్ రూట్లో వచ్చిన మరో బైకర్ కూడా ఆ బైక్‌ను ఢీకొట్టి కిందపడ్డాడు.
మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. రాంగ్ రూట్లో వచ్చిన బైకర్ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
📍Surat
People takes wrong side driving very casually. It should be big offense with heavy fine.
Biker dies after trying to save another wrong-side rider; accident CCTV goes viral!pic.twitter.com/6C8fUNBLkz
— My Vadodara (@MyVadodara) January 9, 2026
Also Read:
Man Shoots Wife, Children, Kills Self | భార్య, పిల్లలను కాల్చి చంపి.. వ్యక్తి ఆత్మహత్య
Bengal Governor Gets Threat Email | ఈడీ రైడ్స్ హై డ్రామా తర్వాత.. బెంగాల్ గవర్నర్‌కు బెదిరింపులు