రై రై రారా.. అడ్డే లేని దారై రారా..
అగ్ర హీరో రామ్‌చరణ్ నటిస్తున్న పానిండియా మాస్ ఎంటర్టైనర్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
అగ్ర హీరో రామ్‌చరణ్ నటిస్తున్న పానిండియా మాస్ ఎంటర్టైనర్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ‘చికిరి’ సాంగ్ అయితే.. విదేశీయులు సైతం రీల్స్ చేసేంత క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే సోమవారం ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘రై రై రారా.. రై రై రారా.. అడ్డే లేని దారై రారా.. రై రై రారా.. రై రై రారా.. హద్దే లేని తీరై రారా..’ అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా, ఏ.ఆర్.రెహ్మాన్ స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. క్యాచీగా, జనబాహుళ్యంలోకి త్వరగా వెళ్లేలా, శ్రోతల్ని అలరించేలా ఈ మాస్ నంబర్ సాగింది.
కథానాయకుని పరిచయగీతం ఎలా ఉండాలో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేస్తూ, ఈ గీతాన్ని రూపొందించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. రామ్‌చరణ్ తన మాస్ ఎనర్జీతో కూడిన గ్రేస్‌తో ఈ పాటలో స్టెప్పులు అదరగొట్టారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, నిర్మాత: వెంకటసతీష్ కిలారు, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

