న్యూఢిల్లీ: బ్రిటన్ బయలుదేరిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు దారి మళ్లాయి. ప్రతికూల వాతావరణం కారణంగా బ్రిటన్‌లోని వేర్వేరు ఎయిర్పోర్లుల్లో అవి ల్యాండ్ అయ్యాయి. (Air India Flights Diverted) ఎయిర్ ఇండియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 8న ముంబై నుంచి లండన్‌లోని హీత్రూకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా హీత్రూ ఎయిర్‌పోర్ట్‌పై ఆ విమానం చక్కర్లు కొట్టింది. చివరకు ఆ విమానం దారి మళ్లింది. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
కాగా, అదే రోజున పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు మరో ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బర్మింగ్‌హామ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాలేకపోయింది. గాలిలో రౌండ్లు కొట్టిన ఆ విమానాన్ని చివరకు లండన్‌లోని హీత్రూకు మళ్లించారు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఆ రెండు విమానాలు గమ్యస్థానాలు మారినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.
Also Read:
Bengal Governor Gets Threat Email | ఈడీ రైడ్స్ హై డ్రామా తర్వాత.. బెంగాల్ గవర్నర్‌కు బెదిరింపులు
Man Shoots Wife, Children, Kills Self | భార్య, పిల్లలను కాల్చి చంపి.. వ్యక్తి ఆత్మహత్య
Watch: బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బైకర్ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?