Israel Defense Forces: 300 క్షిపణులు ఫైర్ చేసిన ఇరాన్.. వాటిల్లో సగం క్లస్టర్ బాంబ్ వార్‌హెడ్స్: ఐడీఎఫ్
Israel Defense Forces: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఇప్పటి వరకు సుమారు 300 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దాంట్లో సగం వరకు క్లస్టర్ బాంబులతో కూడిన వార్‌హెడ్స్ ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొన్నది. మొదటి రోజు 90 క్షిపణులను ప్రయోగించిన ఇరాన్.. ఆ తర్వాత క్రమంగా సంఖ్యను తగ్గిస్తూ వెళ్లిందని ఐడీఎఫ్ చెప్పింది.
జెరుసలాం: ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి చేస్తూనే ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 300 బాలిస్టిక్ క్షిపణులను రిలీజ్ చేసింది. దాంట్లో సగం వరకు క్లస్టర్ బాంబులతో కూడి వార్‌హెడ్స్ ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) పేర్కొన్నది. మంగళవారం కూడా ఇరాన్ తన క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని తిప్పికొడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే భారీ వార్‌హెడ్‌తో వచ్చిన ఓ క్షిపణి.. బీట్ షెమేస్లో ఉన్న ఓ ఖాళీ స్థలంలో పడినట్లు అధికారులు చెప్పారు. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
క్లస్టర్ బాంబుల్లో ఉన్న వార్‌హెడ్స్ అత్యంత ప్రమాదకరమైనవి. క్షిపణి పేలిన తర్వాత వాటి నుంచి పేలుడు పదార్ధాలు డజన్ల సంఖ్యలో వేరుపడుతాయి. సబ్మ్యునిషేన్స్లో కిలోల కొద్దీ పేలుడు పదార్ధాలు ఉంటాయి. అయితే అవి కనీసం పది కిలోమీటర్ల దూరం చెల్లాచెదురుగా పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. క్లస్టర్ బాంబులను వదిలే క్షిపణులను ప్రస్తుతానికి సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, కానీ వాటి వాళ్లు సవాళ్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొన్నది. ఇజ్రాయెల్ వైమానిక క్షేత్రం సంపూర్ణంగా సురక్షితంగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గత జూన్‌లో సుమారు 12 రోజుల పాటు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వార్ జరిగింది. అయితే ఆ సమయంలో ఇరాన్ కనీసం మూడు సార్లు ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులను జారవిడిచినట్లు తెలిసింది. ఫోటోలు, వీడియో ఆధారంగా ఈ విషయాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ద్రువీకరించింది. క్లస్టర్ మ్యునిషన్స్పై 2008లో కుదిరిని ఒప్పందం ప్రకారం ఆ బాంబులను వాడరాదు. అప్పట్లో వంద దేశాలు ఆ ఒప్పందంపై సంతకం చేశాయి. కానీ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఆ ఒప్పందంపై సంతకం చేయలేదు. తాజా ఇరాన్ దాడి వల్ల సుమారు 12 మంది మృతిచెందగా, రెండు వేల మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు.
యుద్ధం ప్రారంభమైన తొలి రోజు ఇరాన్ సుమారు 90 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ఫైర్ చేసింది. ఆ తర్వాత రోజు ఆ సంఖ్యను 60కి తగ్గించింది. ఇక ఆ తర్వాత వరుసగా ఆరు రోజులు సగటును 20 క్షిపణులను వరకు ఇరాన్ ప్రయోగించింది. వాటిల్లో చిన్నపాటి ప్రొజెక్టైల్స్ ఉన్నాయి. ఇక ఆదివారం, సోమవారం.. 20 కన్నా తక్కువ క్షిపణులను ఇరాన్ వదిలినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. ఇప్పటి వరకు ఇరాన్‌కు చెందిన సుమారు 300 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని, ఇది ఇరాన్ స్టాక్‌లో 60 శాతం ఉంటుందని ఐడీఎఫ్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

