కోల్కతా: బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉన్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాల పెన్ డ్రైవ్లు తన వద్ద ఉన్నాయని తెలిపారు. తనపై మరింత ఒత్తిడి చేస్తే వాటిని బయటపెడతానని ఆమె హెచ్చరించారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రైడ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కోల్కతాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
కాగా, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈ నిరసన ర్యాలీకి నేతృత్వం వహించారు. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్ స్కామ్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం చివరికి అమిత్ షా వద్దకే చేరిందని అన్నారు. బెంగాల్ బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ద్వారా ఆ నిధులు అమిత్ షాకు అందాయని ఆరోపించారు.
మరోవైపు అమిత్ షా ప్రమేయం వల్లనే బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ దళాలు బొగ్గు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమయ్యాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘నా వద్ద పెన్ డ్రైవ్లు ఉన్నాయి. నేను కూర్చొన్న కుర్చీ పట్ల గౌరవంతోనే నేను మౌనంగా ఉన్నా. నన్ను ఎక్కువగా ఒత్తిడి చేయవద్దు. నేను ప్రతిదీ వెల్లడిస్తా. దేశం మొత్తం షాక్ అవుతుంది’ అని అమిత్ షాకు వార్నింగ్ ఇచ్చారు.
judge leaves courtroom | టీఎంసీ, ఈడీ న్యాయవాదుల మధ్య కోర్టులో తోపులాట.. వెళ్లిపోయిన న్యాయమూర్తి
Bengal Governor Gets Threat Email | ఈడీ రైడ్స్ హై డ్రామా తర్వాత.. బెంగాల్ గవర్నర్కు బెదిరింపులు
Man Shoots Wife, Children, Kills Self | భార్య, పిల్లలను కాల్చి చంపి.. వ్యక్తి ఆత్మహత్య