ఇల్లెందు : క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య (MLA Kanakaiah ) అన్నారు. ఇల్లెందు పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల స్థాయి బాస్కెట్బాల్ ( Basket Ball ) టోర్నమెంట్ను శనివారం సాయంత్రం ప్రారంభించారు. మూడు జిల్లాల నుంచి 10 జట్లు పాల్గొంటున్నాయని నిర్హాకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన తల్లిదండ్రులైన కోరం పుల్లయ్య, సింగమ్మ ల జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల వల్ల మానసికంగా శారీరకంగా, దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు.
క్రీడల్లో రాణించిన వారు రాబోయే తరంలో ఉన్నత స్థానంలో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, కోరం సురేందర్, తహసీల్దార్ రవికుమార్, సీఐ తాటిపాముల సురేష్, నాయకులు పెండల రాజు, పులిగండ్ల మాధవరావు, నాయకులు , తదితరులు పాల్గొన్నారు.