అమెరికాలో అగ్ని ప్రమాదం.. చికిత్స పొందుతూ హన్మకొండ జిల్లా విద్యార్థి మృతి
అమెరికాలో విషాదం నెలకొంది. 15 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన హన్మకొండ జిల్లా విద్యార్థి మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు.
అమెరికాలో విషాదం నెలకొంది. 15 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన హన్మకొండ జిల్లా విద్యార్థి మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు.
వివరాల్లోకి వెళ్లే.. హసన్‌పర్తి మండలం గంటూర్పల్లికి చెందిన భరత్ చందర్ ఉన్నత విద్య కోసం 2023లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలోని టాంపాలో ఉంటున్నారు. చదువు పూర్తవ్వడంతో ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలోనే అగ్నిప్రమాదానికి గురయ్యాడు. గత నెల 25వ తేదీన జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 75 శాతం శరీరం కాలడంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే 15 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న భరత్.. తుదిశ్వాస విడిచారు.
భరత్ మృతితో అతని స్వగ్రామమైన గుంటూర్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదువు పూర్తి చేసుకుని తిరిగొస్తే పెళ్లి చేద్దామని అనుకుంటే.. ఇంతలోనే ఇలాంటి విషాద వార్త వినాల్సి వచ్చిందని భరత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

