Prakash Raj | నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
Prakash Raj | బెంగళూరు (Bengalore) ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై విమర్శలు గుప్పించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కు ఎన్నికల కమిషన్ (Election Commission) గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని, అసలు నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నామని స్పష్టంచేసింది.
Prakash Raj : బెంగళూరు (Bengalore) ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై విమర్శలు గుప్పించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కు ఎన్నికల కమిషన్ (Election Commission) గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయన ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని, అసలు నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నామని స్పష్టంచేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వేలో భాగంగా అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు, ప్రకాశ్ రాజ్ నాలుగేళ్ల క్రితమే తన నమోదిత చిరునామా నుంచి వేరే ప్రాంతానికి మారినట్లు వెల్లడైందని ఈసీ తెలిపింది.
తాను వేరే చోట నివసిస్తున్న విషయాన్ని ప్రకాశ్ రాజ్ స్వయంగా అంగీకరించారని, కొత్త చిరునామా ఆధారంగా ఓటును పునరుద్ధరించుకోవడానికి ఫారమ్ 6 దాఖలు చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. కాగా బెంగళూరులోని తన సొంత నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పేరు మాయమవ్వడంపై ప్రకాశ్ రాజ్ అంతకుముందు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తాను పుట్టి పెరిగిన ఊర్లోనే తన ఓటును తొలగించడం శోచనీయమని, ఇది ఒక పెద్ద జోక్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తన ఒక్కడిదే కాకుండా ఏకంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి గాల్లోకి లేపేశారని ఆరోపిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఏది ఏమైనా న్యాయపోరాటం చేసి లేదా దరఖాస్తు చేసుకుని తన ఓటును మళ్లీ సాధించుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఈసీ ఈ అంశానికి సంబంధించి వివరణ ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

