Suryakumar Yadav : డిఫెండింగ్ ఛాంపియన్‌గా పొట్టి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత జట్టు.. అంచనాలను నిలబెట్టుకుంది. స్వదేశంలో.. సొంత ప్రేక్షకుల మద్దతుతో ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. వరుసగా రెండో ట్రోఫీ పట్టేయాలనే పట్టుదలతో ఉంది. ఆరంభ సీజన్లో ఎంఎస్ ధోనీ(MS Dhoni), రెండేళ్ల క్రితం రోహిత్ శర్మ (Rohit Sharma)లు కప్ అందించగా.. ఈసారి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కు దిగ్గజ కెప్టెన్ల సరసన చేరే సువర్ణావకాశం వచ్చింది.
అహ్మదాబాద్‌లో ఆదివారం ఫైనల్ పోరు సన్నద్ధత.. జట్టు కూర్పు, ప్రత్యర్ధిని కట్టడి చేయడం.. గురించి శనివారం సాయత్రం కెప్టెన్ సూర్య మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు పలు ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు చెప్పాడు.
Marching towards the #Final 👏
A step away from 𝙂𝙡𝙤𝙧𝙮 🏆#TeamIndia is into the #T20WorldCup finale 🥳Scorecard ▶️ https://t.co/LxSBs3EDPx#MenInBlue | #ENGvIND pic.twitter.com/6BBNkNw2aB
— BCCI (@BCCI) March 5, 2026
అంతకుముందు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. ‘సొంత ప్రేక్షకులను నిశబ్ధంలోకి నెట్టేస్తా’మని అన్నాడు. కివీస్ సారథి కామెంట్‌పై మీ స్పందన ఏంటీ అని సూర్యను అడుగగా.. ‘ప్రత్యర్ధి కెప్టెన్ ఎవరైనా.. ప్రతిఒక్కరు అదే మాట చెబుతున్నారు. వారు కాస్త కొత్తగా ప్రయత్నించాల’ని సూచించాడు.
మీడియా : వరల్డ్ నంబర్ 1 స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వైఫల్యంపై ఏమంటారు? ఫైనల్‌కు మార్పులు ఉంటాయా?
సూర్యకుమార్ యాదవ్ : స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌పై ఆందోళన చెందడం లేదు. మేము మ్యాచ్ గెలిచాం. క్రికెట్ అనేది సమిష్టి ఆట. సో.. అందరం మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి పెడుతాం. జట్టు గెలిచినా.. ఓడినా వ్యక్తిగత ప్రదర్శనల గురించి పెద్దగా ఆలోచించం.

జట్టులోని 11 మంది ఒకేసారి అత్యుత్తమ ఆటను ఆడలేరు. ఒకరిద్దరు కష్ట సమయం ఎదుర్కొంటారు. అలాంటప్పుడు వారికి మేము మద్దతుగా నిలుస్తాం. వరుణ్ చక్రవర్తి నంబర్ 1 టీ20 బౌలర్. అతడికి తన బాధ్యతలు తెలుసు. ఫైనల్లో అతడు రాణిస్తున్నాడని ఆశిస్తున్నా. ఫైనల్ మ్యాచ్ తుది జట్టు గురించి ఇప్పుడే చెప్పను.
మీడియా : ఫైనల్‌కు నల్లమట్టి.. ఎర్రమట్టి పిచ్ ఉంటుందా? మీరు ఎలాంటి పిచ్ కోరుకుంటున్నారు?
సూర్యకుమార్ యాదవ్: పిచ్ ఎలా ఉందో ఇంకా చూడలేదు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాను. మీడియా సమావేశం పూర్తయ్యాక నేను పిచ్‌ను పరిశీలిస్తాను. మాకు ఏ మట్టి పిచ్ అయినా ఓకే. టోర్నమెంట్లో మేము ఎర్రమన్ను, నల్లమన్ను పిచ్‌ల మీద ఆడాం. సో.. మాకు ఏ పిచ్ అయినా సమస్య లేదు.
మీడియా : రోహిత్ శర్మ వారసత్వాన్ని కొనసాగించడం ఎలా ఉంది?
సూర్యకుమార్ యాదవ్ : చాలా గర్వంగా ఉంది. కెప్టెన్‌గా నేను రోహిత్ దారిలోనే నడుస్తున్నా. అతడి సారథ్యంలో ఆడినప్పుడు చాలా నేర్చుకున్నా. కోచ్ గౌతం గంభీర్ అనుభవం కూడా నాకు ఎంతో ఉపయోగపడుతోంది. నా ఆలోచనలతో పాటు రోహిత్ ఐడియాలను నేను ఆచరణలో పెడుతున్నా. నిజంగా అవన్నీ సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రపంచకప్ సన్నద్ధతను రెండేళ్లు కిందటే మొదలెట్టాం. మంచి క్రికెట్ ఆడడం, కష్టమైన పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకపోవడం మాలోని ప్లస్ పాయింట్స్.

మీడియా : మీ కెప్టెన్సీ మంత్ర ఏంటీ?
సూర్యకుమార్ యాదవ్ : జట్టులో మంచి సంస్కృతి, వాతావరణం చాలా ముఖ్యం. ఆటగాళ్లకు మైదానంలో ఏం చేయాలనేది స్పష్టత ఉండాలి. జట్టును సంతోషంగా ఉంచితే.. వారు తమ ఆలోచనలను పంచుకుంటారు. కెప్టెన్సీ అనేది ఒక పొజిషన్ అంతే. అందరితో మాట్లాడి.. ఏది మంచిదో నిర్ణయానికి రావాలి. చెప్పాలంటే.. సమిష్టిగా ఒక బండిని నడపడం లాంటింది.
మీడియా : సన్నాహక సిరీస్‌లో 4-1తో భారత్ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌తో ఫైనల్లో తలపడున్నారు. ఆ జట్టులో వచ్చిన మార్పులేంటీ?
సూర్యకుమార్ యాదవ్ : నేను ఆ జట్టు మ్యాచ్‌లు చూడలేదు. వరల్డ్‌కప్ ముందే మేము వారితో ఆడాం. సో.. తెలిసిన జట్టే. మా లెక్కనే వారు చాలా మంచి క్రికెట్ ఆడుతున్నారు. కాబట్టి ఆదివారం ఫైనల్ ఆసక్తికరంగా ఉండనుంది.
మీడియా : సీనియర్లు బుమ్రా, పాండ్యా అనుభవం ఉపయోగపడుతోందా?
సూర్యకుమార్ యాదవ్ : ప్రస్తతం జట్టులో ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కోచ్ గంభీర్, బుమ్రా, పాండ్యాలు చాలా వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడారు. వీరితో మాట్లాడడం మాకు ఎంతో లాభిస్తోంది. డిన్నర్ సమయంలో, టీమ్ బస్సులో కూడా మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి? అనేది చర్చించుకుంటాం. సో.. ఇవన్నీ బిగ్ మ్యాచ్‌లో ఎంతో ప్రభావం చూపుతాయి.

మీడియా : భారత జట్టు ఒత్తిడిని ఎలా అధిగమిస్తోంది?
సూర్యకుమార్ యాదవ్ : వరల్డ్‌కప్ లాంటి ఈవెంట్లో ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యం. అందుకే నెట్స్‌లో.. కష్టమైన క్యాచ్‌లు అందుకోవడం, మ్యాచ్ పరిస్థితులను ఊహించుకోవడం వంటివి సాధన చేస్తాం. ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం. తద్వారా.. మైదానంలోకి దిగాక ఒత్తిడికి లోనవ్వకుండా ఉండగలుగుతాం.
మీడియా : నాకౌట్ నుంచి చెలరేగి ఆడుతున్న సంజూ శాంసన్‌కు రివార్డ్ ఉంటుందా?
సూర్యకుమార్ యాదవ్ : వరల్డ్‌కప్‌లో నేను, కోచ్ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. జట్టు ప్రయోజనాల మేరకు.. మ్యాచ్‌ను బట్టి కొందరిని పక్కన పెట్టాం. సూపర్ 8లో దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ఎందుకు ఆడించలేదో అతడికి వివరించాం.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అభిషేక్, శాంసన్, ఇషాన్‌లను లెఫ్ట్, రైట్, లెఫ్ట్.. ఓపెనింగ్ కాంబినేషన్లో ఆడించాం. అవన్నీ ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయి. సంజూ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. జట్టులో లేకున్నా సరే అతడు ప్రాక్టీస్ మానేయలేదు. అతడి కష్టానికి ప్రతిఫలం మనం చూస్తున్నాం.
మీడియా : మరోసారి 250 ప్లస్ కొడతారా?
సూర్యకుమార్ యాదవ్ : ముందుగా పరిస్థితులకు తగ్గట్టు ఆడుతాం. డ్రెస్సింగ్ రూమ్‌లో కాకుండా.. ఎన్ని పరుగులు చేయాలనేది పరిస్థితులను బట్టే నిర్ణయించుకుంటాం. గతంలో మేము 250కి పైగా కొట్టాం. ఫైనల్లోనూ పరిస్థితులకు తగ్గట్టే మా ఆట ఉంటుంది.
ఐపీఎల్ మెరుపులతో లేటు వయసులో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ టీ20లకు ప్రత్యేక ఆకర్షన తెచ్చాడు. అభిమానులతో ముద్దుగా ‘స్కై’ అని పిలిపించుకొనే సూర్య.. సారథిగా వరుసగా సిరీస్‌లు గెలుస్తూ వస్తున్నాడు. ఈసారి ప్రపంచకప్‌లోనూ జట్టును గొప్పగా నడిపిన అతడు.. ఫైనల్లోనూ గెలుపే మంత్రగా ఆడుతామని చెప్పాడు.