చండీగఢ్: వందే భారత్ రైలు చక్రంలో ఒక బోల్ట్ ఇరుక్కుపోయింది. దీంతో పెద్ద శబ్దం వచ్చింది. ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలు (Vande Bharat) ఒక స్టేషన్లో గంటకుపైగా నిలిచిపోయింది. శనివారం అమృత్సర్-ఢిల్లీ వందే భారత్ వీల్ వద్ద బోల్ట్ జామ్ అయ్యింది. దీంతో పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.
కాగా, హర్యానాలోని సందల్ కలై స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దీంతో వందే భారత్ లోకోపైలట్ అప్రమత్తమయ్యాడు. ఆ రైలును మెల్లగా నడిపి హర్యానాలోని సోనిపట్ స్టేషన్‌కు చేర్చాడు. రైల్వే అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) వందే భారత్ రైలు వద్దకు చేరుకున్నారు. సాంకేతికంగా తనిఖీ చేశారు.
మరోవైపు వీల్ వద్ద బోల్ట్ ఇరుక్కున్నట్లు రైల్వే సిబ్బంది గమనించారు. ఆ సమస్యను సరిదిద్దారు. దీంతో గంట తర్వాత వందే భారత్ రైలు అక్కడి నుంచి కదిలింది. ఆ మార్గంలోని పలు రైళ్లను లూప్ లైన్‌కు మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read:
Kapil Sibal | ‘ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాలపై ఈడీ దాడులు’.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కపిల్ సిబల్
ED moves Supreme Court | ఐ-ప్యాక్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
Dalit Woman Murdered, Daughter Kidnapped | దళిత మహిళను హత్య చేసి.. ఆమె కుమార్తెను కిడ్నాప్