కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజకీయ వ్యూహాల ప్రణాళిక సంస్థ ఐ-ప్యాక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. (ED moves Supreme Court) కలకత్తా హైకోర్టులో విచారణ వాయిదా పడిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఐ-ప్యాక్ బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఈడీ ఆరోపించింది. చట్టబద్ధంగా సోదాలు నిర్వహించకుండా, దర్యాప్తునకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోకుండా నిరోధించినట్లు పిటిషన్లో పేర్కొంది.
కాగా, ఆ రాష్ట్ర సీనియర్ అధికారుల సమక్షంలో భౌతిక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీఎం మమతా బెనర్జీ బలవంతంగా తీసుకెళ్లినట్లు ఈడీ ఆరోపించింది. జనవరి 8న జరిగిన పరిణామాలను అందులో వివరించింది. పోలీసు సిబ్బందితో సహా రాష్ట్ర అధికారులు, సీఎం మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడం న్యాయాన్ని అడ్డుకోవడమేనని, దర్యాప్తు సమగ్రతను దెబ్బతీసినట్లు ఈడీ పేర్కొంది.
మరోవైపు ఈడీ చర్యను ముందే ఊహించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ప్రభుత్వ వాదన వినకుండా ఏ విషయంలోనూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరింది. తమ వాదనను కోర్టు ముందు ఉంచే వరకు ఈడీకి ఎలాంటి ఉపశమనం కల్పించవద్దని సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
Also Read:
Mamata Banerjee | ‘బొగ్గు కుంభకోణంలో అమిత్ షా ప్రమేయం’.. తన వద్ద పెన్ డ్రైవ్లు ఉన్నాయన్న మమతా
Dalit Woman Murdered, Daughter Kidnapped | దళిత మహిళను హత్య చేసి.. ఆమె కుమార్తెను కిడ్నాప్